వేసవి సెలవుల్లో -: సరికొండ శ్రీనివాసరాజు


వేసవి సెలవులను గడిపేందుకు తమ పట్టణ ప్రాంతం నుంచి పల్లెటూరికి చేరుకున్న మిత్ర బృందం ఒకచోట సమావేశం అయ్యారు. సమావేశపరచింది సతీశ్. 8 మంది మిత్రులు కలుసుకున్నారు. "ఈ సెలవులను ఎలా గడుపుదాం?" అన్నాడు సతీశ్.  టి.వి.ల్లో ఏటా వచ్చే క్రీడలను చూస్తూ ఎంజాయ్ చేస్తామని అన్నారు మిగిలిన ఏడుగురు? "ఈ మాత్రం దానికి అమ్మమ్మ ఇళ్లకు రావాలి? ఇంట్లోనే కూర్చుంటే సరిపోయేది కదా! ఛార్జీలు మిగిలేవి?" అన్నాడు సతీశ్. ఎవరెవరు ఏయే జట్టును అభిమానిస్తారో కనుక్కున్నాడు సతీశ్. "శభాష్ రంగ! నువ్వు తెలుగు వాడివి అనిపించుకున్నావు?" అన్నాడు సతీశ్. రంగ కాలర్ ఎగరేశాడు. "నువ్వు అభిమానించే హైదరాబాద్ జట్టులో తెలుగువారు ఎందరు?" అడిగాడు సతీశ్. ముఖం వేలాడేశాడు రంగ. "ఒరేయ్ తిరుమలేశు! నువ్వు అభిమానించే ముంబై జట్టులో నీ అభిమాన ఆటగాడు ఎవరు?" అని అడిగాడు సతీశ్. చెప్పాడు తిరుమలేశు. "అతడు మొదటి నుంచీ ముంబై జట్టులోనే ఉన్నాడా?" అడిగాడు సతీశ్. సమాధానం లేదు. "ఒక విదేశీ ఆటగాడు మన స్వదేశీయుణ్ణి అవుట్ చేస్తే నంబరాలు చేసుకుంటాం మనం." అన్నాడు సతీశ్. "ఔను ఇందులో దేశభక్తి నాకు కనబడటం లేదు. ఈ ఆటలు మితిమీరి ఆడి అలసి పోవడం వల్ల లేదా గాయాల బారిన పడటం వల్లనో అంతర్జాతీయ ఆటల్లో సరిగా ఆడే అవకాశం లేదు కదా!" అన్నది శ్రుతి.

        "అందుకే మనం ఆ ఆటల్ని పక్కన పెట్టి, మనమే పోటీలు పెట్టుకుందాం." అన్నాడు సతీశ్. ఈ ఆలోచన అందరికీ నచ్చింది. అమరేంద్ర ఆలోచన ప్రకారం పెద్దలను కలిశారు. వారు చిన్నతనంలో ఆడిన ఆటలను ఆడే విధానాలను తెలుసుకున్నారు- సెలవులు మొత్తంరకరకాల ఆటలతో ఎంజాయ్ చేశారు. అంతరించినవి అనుకుంటున్న ఆటలను మళ్లీ చూస్తున్నందుకు సంబరపడ్డారు. 

కామెంట్‌లు