చాలా గాయాలకు, చాలా కోరికలకు
చాలా సందేహాలకు, చాలా ఘర్షణలకు
కాలం మాత్రమే సమాధానం చెబుతుంది!
దానికి ఏకైక రహదారి నిశ్శబ్దం
ఈ నిశ్శబ్దపు రహదారిపై
మౌనపు చేతికర్ర ఆసరాతో
ముందుకు నడుస్తూ
మునుముందుకు ప్రయాణిస్తుంటే
ఏదో ఒక మలుపులో
కాలం ఎదురుపడి
మన కష్టాల్నీ, గాయాల్నీ,
బాధల్నీ కరిగించేస్తుంది!
అప్పటి వరకూ
భారమైన ఈ జీవితం
గేయమై సాంత్వన చేకూరుస్తుంది!
దీనికి కావాల్సింది
కేవలం సహనం, శ్రద్ధా,
ఏకాగ్రతలే సుమా!!
**************************************
ఆశ;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి