శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది -ఎం. వి. ఉమాదేవి
46)అప్రమేయాః -

ఏ విధమైన ప్రమాణమెరుగడు 
కొలతలకు అందని వాడు 
హేతువుకునూ అందలేడు 
నిర్వచనం చెప్పలేనివాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
47)హృషీకేశః -

ఇంద్రియములకు ప్రభువైవున్నాడు
సూర్యచంద్ర కిరణవిభుడు
కేశకిరణములున్నట్టి వాడు 
హృషీకేశుడు హర్షమిచ్చువాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు!ఉమా!
48)పద్మనాభః -

నాభియందు పద్మమున్నవాడు 
చతుర్ముఖునికి జనకుడు
జ్ఞానపద్మము వున్నట్టివాడు
జీవులపుట్టుకకు కారకుడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
49)అమరప్రభుః -

అమరావతికి అధిపతి
అమరులయిన దేవతాపతి 
అమరేంద్రుని శాశించు పతి 
స్వామి సర్వభూతములకు  పతి 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
50)విశ్వకర్మః -

విశ్వకర్మలను కలిగినవాడు
విశ్వసృష్టికి కారణమైనవాడు
నిర్మాణసమర్థత గలవాడు
బృహ్మకు ముందే సృష్టిచేయువాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!

కామెంట్‌లు