సుప్రభాత కవిత ; బృంద
నీలి మేఘం తొంగి చూసే
నిండు చెరువులో
నీలమంత చేరిపోయె నీటిలో
తెల్లబోయి  నిలిచిపోయె నింగిలో

వెండిపూలు చల్లుతున్న
వెలుగు రేఖలు చూసి
నిండుగా జలతారంచు
సర్దుకుంది  ముచ్చటగ రేవు

మెరిసి పోయే నీటివంక
మురిసి పోయి చూసెనంట
విరిసిన  పూవులంటి 
నవ్వులతో పుడమి

తెల్లవారి వెలుగులోన
వెల్లి విరియు సోయగాలు
ఎల్లెడలా కనిపించి మదిని
మల్లె మాలలెన్నొ ఊగించెగా

కొమ్మ చాటున సూటిగా
సూదిగుచ్చగ  వెచ్చగా
మంచు తాకిన కిరణమల్లే
తనువు విరిసె హాయిగా!

వేకువలో  వెలుగు వేపు
ఊగుతున్న ఊయలై
సాగుతున్న జీవితాన
కోరుకున్న పెన్నిధులన్నీ

మూటకట్టి మోపుగా
మోసుకొచ్చు రేపుగా
ఆశలన్ని నింపుకుని
ఆనందం వెల్లువైన ఉదయానికి

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు