భక్త కూర్మదాసు! అచ్యుతుని రాజ్యశ్రీ

 పైథాన్ అనే పల్లెలో కూర్మదాసు అనే పాండురంగడి భక్తుడు న్నాడు.పాపం పుట్టుకతోనే కాళ్ళు చేతులు లేని దివ్యాంగుడు.హరిదాసు చెప్పిన దైవ కథలు విన్న అతనికి పండరీపురం వెళ్లాలనే కోరిక కల్గింది.కానీ ఎలా వెళ్లాలి? ప్రయాణ సాధనాలు లేని కాలం.భజనలు చేస్తూ వెళ్లే భక్తుల బృందాలని వేడుకున్నాడు.నడకతో వెళ్లేవారికి ఇతను భారం కదా? అంతా నిరాకరించారు.ఇక ఒంటరిగా ప్రాకుతూ నాల్గు నెలల్లో  బహుళ అనే ఊరు చేరాడు.శరీరమంతా అలసి గాయాలు రక్తంతో దుఃఖం తో దైవస్మరణతో ఉండిపోయాడు.ఒక భక్తబృందానికి తన గోడు విన్పించి పండరీపురం వెళ్లి తనబాధను దైవానికి విన్పించమని వేడుకుంటాడు.ఆవిషయం తెలుసు కున్న జ్ఞానదేవ నాందేవులతో పాటు సావితామాలి బహుళగ్రామానికి వెళ్ళాడు.అక్కడ ఆముగ్గురు విఠలుని ప్రార్థిస్తే భగవంతుడు కూర్మదాసు కి దర్శనం ఇస్తాడు.పాండురంగడి అనుగ్రహం తో అతనికి కరచరణాలు వచ్చాయి." దేవా! నాకు కోరికలు లేవు. కానీ నాలాగా ఎందరో నిస్సహాయంగా నీదగ్గరకు రాలేరు.ఈబహుళ గ్రామంలో ఉండిపో స్వామీ" అని పరిపరివిధాల వేడుకుంటాడు.అలా స్వామి శిలారూపంలో వెలిశాడు.ఇప్పటికీ పండరీపురం వెళ్లేవారు బహుళ అనే ఆప్రాంతంని దైవాన్ని దర్శించిన తర్వాతే తమయాత్రను కొనసాగిస్తూ వచ్చారు.ఆషాఢశుద్ధ ఏకాదశి రోజు  కూర్మదాసు పాండురంగనిలో ఐక్యమైనాడు🌷
కామెంట్‌లు