సుప్రభాత కవిత ; - బృంద
హిమ బిందువులతో
అభిషేకిస్తూ..
సుమ చక్షువులతో
హారతిస్తూ...
అవని

ప్రేమ నిండిన మనసుతో
ఆరాధిస్తూ
హేమ వర్ణపు వెలుగుబంతిని
మనసారా స్వాగతిస్తూ..
వనం

ఒకో రేకూ విప్పుకుంటూ
ఒకో క్షణం నిరీక్షణ ముగిస్తూ
స్వామి రాకను అనుభవిస్తూ 
సుమం

కోటికలలు ఏకమై వచ్చే
కోరుకున్న ఉదయానికై
ఎదురుచూస్తూ..
జీవితం

తలపులలో నామధేయం
కన్నులలో కమనీయ రూపం
నీమముగ స్మరిస్తూ... 
హృదయం


నడిచే బ్రతుకు బాటలో
రాళ్ళు పువ్వులై పోయేలా
ముళ్ళు మాయం చేస్తూ..

ఎడదలో ఎడతెగని
కరుణ  దయ ప్రేమ నింపి
పంచిపెట్టి అవే పొందేలా చేస్తూ

మనుగడను మధురం చేసే
మమతలు మనసుకు అందేలా
బంధాలను చేరువ చేస్తూ...

అపురూప క్షణాలన్నీ
అందమైన పొట్లం కట్టి
అనుగ్రహించి అందించే వేకువకు

🌸🌸సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు