ధర్మరాజు సూక్ష్మ బుద్ధి! అచ్యుతుని రాజ్యశ్రీ

 మహాభారతంలో ధర్మరాజు ఎక్కువ మాట్లాడడు.కానీ తన మాటల్తో అందర్నీ మెప్పించి ఒప్పించే శక్తి ఆయన మాటలకు ఉంది.యక్షప్రశ్నల్లో ఆయన ఇచ్చిన జవాబులు సర్వకాల సర్వావస్థలందు ఆదర్శం ఆచరణీయం.ఆకాశంపురుషుడు స్త్రీ భూమి.మంచి విత్తనాలు వేస్తే మంచి పంటచేతికొస్తుంది.శాస్త్రం తెల్సినవాడు దొరికితే పితృతర్పణాలు చేయాలి.అహంకారం వదిలి కోపంలేనివాడే శోకం లేనివాడు.లోభంలేనివాడే అసలుసిసలు సంపన్నులు.కూడబెడ్తున్నకొద్దీ అత్యాశ దురాశ అంతులేకుండా పెరిగి మనశ్శాంతి లేకుండా చేస్తుంది.ఐశ్వర్యం కాలికి వేసుకునే చెప్పులు.డబ్బుంది కదా అని పెద్ద సైజులో చెప్పులు తొడగం. కొనలేని బీదవాడు చిన్న సైజు చెప్పులు వేసుకుని ఎలా తిరగగలడు? ఏమీలేదు అని ఎప్పుడూ ఏడ్చేవాడు అలా ఏడుస్తూనే ఉంటాడు.తృష్ణ అనేది అగ్ని లో నెయ్యి పోయడం . ఎంత నెయ్యి నూనె నిప్పు లో పోసినా  ఇంకా ఇంకా కావాలి అంటూనే ఉంటుంది.పురుషుడు అంటే కేవలం మగవాడు అని కాదు అర్థం.స్త్రీ మనిషి అని చెప్పుకోవాలి.ప్రయత్నాలు చేసి సాధించేవాడు.అందుకే పురుష ప్రయత్నం అంటాం.రిపబ్లిక్ డే రోజున మన మహిళా శక్తి త్రివిధ దళాల్లో చూశాం కదా? ఆటల్లో కూడా పద్మ అవార్డులు కూడా దక్కించుకున్న వారంతా పురుష ప్రయత్నం తో విజయం సాధించిన మహిళా మణులు.సర్వధని అంటే గుండు సూది మొదలు బంగారం నికూడా సమంగా కష్టసుఖాలు ప్రియం అప్రియం ని ఒకే దృష్టితో భావంతో చూస్తూ చిదానందంగా ఉండేవాడు.ఇతరులని మనసా వాచా కర్మణా బాధపెట్టడం మంచిదికాదు.అవతలివాడు ఏడుస్తూ ఉంటూ మనం వాడిని చూసి " వాడి ఖర్మం..మాబాగా తిక్క కుదిరింది" అని అంటం కుసంస్కారం. అది మనకే తిరిగి తగుల్తుంది.నిశబ్దంగా ఊరుకోవాలి. మాటకి మాట నీటికి నాచు తెగులు అంటారు.అందుకే బడిలో కథలుగా చెప్పాలి.అప్పుడు పరీక్షలు టెన్షన్ ఉండదు.పాండవుల కష్టాల ముందు మనమెంత అని సంతృప్తి పడతాం🌷
కామెంట్‌లు