ప్రకృతి ;- .. కోరాడ నరసింహా రావు..!
కొండ- కోన.... చెట్టు- చేమ
వాగు- వంక తో పచ్చని నేలకు
 సూర్యోదయపు సొగసు ., కొత్త పెళ్ళి కూతురిమస్తాబులా..! 
 అందాలు చిందు తూ...!! 
అరుణారుణ ఆకాశ0 ... 
పుడమీచీకట్లకపై వెలుగుల కళ్లాపి చల్లు తోంది...! 

కాంతి రేఖల ముగ్గులతోనేల
సోయాగాలు చిందు తోంది.! 

ఇరు సంధ్య లలో... అనుది నమూ... ఈ స్వాగత గీతాలు, 
 వీడ్కొలు గానాలూ పరిపాటే! 

ఈ రమణీయతను ఆస్వాది0,చి..అనుభూతించి
 ఆనందించ గలిగే రస హృదయాలకు ఇది కన్నుల పండువే...!! 
       ******


కామెంట్‌లు