కర్ణుని వ్యక్తిత్వం! అచ్యుతుని రాజ్యశ్రీ

 కర్ణుడు లేకుంటే మహాభారతం లేనే లేదు.సద్యోగర్భంలో అంటే నవమాసాలు మోయకుండానే సూర్యుని వరంతో కన్యయైన కుంతీదేవి కి పుడితే ఆమె సూర్యుడు పంపిన మందసంలో పెట్టి నదిలో వదిలింది.అదితేలుతూ పోయిఅతిరథునికి దొరికింది.ఆయన తన భార్య రాధకి ఇస్తాడు.ఆమె కన్నతల్లి కన్నా మిన్నగా తనపాలు ఇచ్చి పెంచింది.వారు ఆపిల్లాడికి పెట్టిన పేరు వసుషేణుడు. ధగధగ మెరిసే కవచం సహజకవచకుండలాలతో తెల్ల మద్ది చెట్టు అంత అందంగా మెరిసిపోతున్న అందాల బాబు వీరుడిగా ఎదిగాడు.రాధేయుడుగా పేరు గాంచాడు.అతనికి పెద్దలపట్ల గౌరవం దానగుణం మాతాపితరుల పట్ల ప్రేమ ఆప్యాయత భక్తి గౌరవాలున్నాయి.కర్ణుడు దురదృష్టవంతుడు.ఏకాంతంలో ఆయన ముగ్గురు వ్యక్తులను కలిశాడు.కన్నతల్లి కుంతి" నీవు నాపెద్ద కొడుకువి.పాండవులతో చేరు.నీవు సార్వభౌముడు గా ఖ్యాతి గడిస్తావు" అంటే " దుర్యోధనుడికి ద్రోహం చేయలేను.నాపరువు మర్యాద కాపాడి అంగరాజుని చేశాడు.యుద్ధంలో అర్జునుడు చిక్కితే చంపుతాను.మిగతా నల్గురినీ వదిలేస్తాను" అని మాట నిలుపుకున్నాడు.ఇంద్రుడు మారువేషంలో వచ్చి కవచకుండలాలు అడిగితే అప్పటికప్పుడు చెవినుంచి కోసి చేతిలో పెట్టాడు.ఆఖరికి శ్రీకృష్ణుడు ఒంటరిగా కర్ణుని తన రథంపై కూచోబెట్టుకుని ఎంతో నచ్చజెప్పాడు" కర్ణా! దుష్ట దుర్యోధనుడిని వదిలి పాండవుల పక్షాన చేరు" . దానికి అతను చెప్పిన జవాబు ఇది" కన్నతల్లి కుంతి పుట్టగానే నన్ను వదిలేసింది.రాకుమారుల అస్త్రవిద్యా ప్రదర్శనలో కృపాచార్యుడు నావంశం గోత్రం అడిగితే అతిరథుని కొడుకు గా నన్ను అంతా చిన్న చూపు చూశారు.అప్పుడు కూడా సభలో ఉన్న కుంతి సూర్య భగవానుడు నిజం చెప్పలేదు.నాకు నాజన్మరహస్యం ఎప్పుడో తెలుసు.ఇన్నాళ్లు చెప్పుకోలేక కుమిలి కుమిలి క్షోభ చెందాను.కృష్ఢా! నామనసులో బాధ నీతో చెప్పుకుని ఈరోజు నాగుండెబరువు దించుకున్నాను.ఇప్పుడు పాండవుల పక్షాన నిలబడి మిత్రద్రోహం నా తల్లిదండ్రులకు శోకం కల్గించి చరిత్ర లో శాశ్వత అపకీర్తిని మూటగట్టుకోను.నీతో మాట్లాడుతూ నాజన్మ ధన్యం సార్థకం చేసుకొన్న నాకు ఇంకేం కావాలి తండ్రీ!" అన్న కర్ణుడు దానకర్ణునిగా శాశ్వతం గా నిలిచాడు.అన్ని దుర్గుణాలు ఉన్న దుర్యోధనుడితో సన్నిహితంగా ఉన్నా తన మంచి బుద్ధులు వదులుకోలేదు.అందరితో స్నేహంగా ఉండాలి కాని వారి లో మంచి ని గ్రహించాలి.మన హద్దుల్లో మనం ఉండాలి.ధన కాంక్ష తో ద్రోహం చేయరాదు.కర్ణుడు శాపాలు పొంది తను యుద్ధం లో చనిపోయాడు.అధర్మం నశించేలా తన పాత్ర పోషించాడు🌹
కామెంట్‌లు