శ్రీ రామ ; - చంద్రకళ యలమర్తి
తిశ్రగతిలో 
అంత్య ప్రాస 
*-***

శ్రీ రామా...మందిరమూ 
అద్భుతమూ సుందరమూ 
శ్రీరామా...  స్మరణమూ 
సర్వపాప హరణామూ

అయోధ్యానగరిలోనా (12)
వెలసినదిపుణ్యక్షేత్రము
భక్తజనులకిలలోనా
 వైకుంఠమే నీధామము

శ్రీదశరథ నందనుడూ
ధర్మమునిల నిలపవచ్చె
ఆశ్రితజన రక్షకునీ...
ఆనందా నిలయామూ 

పితృవాక్య పాలనమూ
ఏకపత్ని...వ్రతముతెలిపె 
 నీజీవనమాదర్శము...
పుణ్యమొసగు నీచరితము

యుగములెన్ని గడచిననూ
 నీనామము మరువలేము 
ఆచంద్రా... తారార్కము
నిలుచునయ్యనీకీర్తనము(7)
**


కామెంట్‌లు