సౌందర్యలహరి ; - కొప్పరపు తాయారు
 🌻శ్రీ శంకరాచార్య విరచిత🌻

స్మరం యోనిం లక్ష్మీం త్రితయమిదమాదౌ తవ మనో-
ర్నిధాయైకే నిత్యే నిరవధిమహాభోగరసికాః ।
భజంతి త్వాం చింతామణిగుననిబద్ధాక్షవలయాః
శివాగ్నౌ జుహ్వంతః సురభిఘృతధారాహుతిశతైః ॥ 33 ॥

శరీరం త్వం శంభోః శశిమిహిరవక్షోరుహయుగం
తవాత్మానం మన్యే భగవతి నవాత్మానమనఘమ్ ।
అతశ్శేషశ్శేషీత్యయముభయసాధారణతయా
స్థితః సంబంధో వాం సమరసపరానందపరయోః ॥

33) ఓ పరమేశ్వరీ! నిత్యులైన కొందరి యోగీశ్వరులు శ్రియం శ్రియం అనే కామ వేద యోనివేద లక్ష్మీ వేదాక్షర సంపుటితో చింతామణుల జపమాలలతో,
కామధేను సంబంధితమైన, ఘృత ధారలతో చివర ఉపాధిలో హోమం చేస్తూ నిన్ను ఆరాధిస్తున్నారు తల్లి!
 34) మా అమ్మా! సూర్యచంద్రులే స్థన యుగ్మముగా,
 శంభునికి అర్ధాంగివి, నవ వ్యూహలతో కూడి దోష రహితుడైన శివుడు నీ శరీరము కనుక, సమరసలు పరమానంద దివ్య స్వరూపులు అయిన మీ ఇద్దరి శేషశేష త్వ సంబంధం అయినది కదా తల్లీ.

                    ***🪷****
🪷 తాయారు 🪷

కామెంట్‌లు