సౌందర్యలహరి ;- కొప్పరపు తాయారు
  🌻శంకర విరచిత🌻
ముఖం బిందుం కృత్వా కుచయుగమధస్తస్య తదధో
హరార్ధం ధ్యాయేద్యో హరమహిషి తే మన్మథకలామ్ 
స సద్యః సంక్షోభం నయతి వనితా ఇత్యతిలఘు
త్రిలోకీమప్యాశు భ్రమయతి రవీందుస్తనయుగామ్ ॥ 19 ॥
కిరంతీమంగేభ్యః కిరణనికురంబామృతరసం
హృది త్వామాధత్తే హిమకరశిలామూర్తిమివ యః ।
స సర్పాణాం దర్పం శమయతి శకుంతాధిప ఇవ
జ్వరప్లుష్టాన్ దృష్ట్యా సుఖయతి సుధాధారసిరయా
19) ఓ మాతా! జగజ్జననీ ! నీ మోమును బిందువుగా చేసి దాని కింద సూర్యచంద్రులను  కుచయుగముగా నుంచి, దాని కిందుగా త్రికోణము నుంచి, నీ కళను (ఆతల్లీ విరాట్స్వరూపాన్ని)ఎవరు ధ్యానించుచున్నా
రో, వారు సర్వసిద్ధులనూ వశం చేసుకొని
 ముల్లోకములనూ మోహ పెట్టగలరు.
20) సహస్రార కమలములో దేవి స్వరూపం దేవి అమృత ధారలను వర్షిస్తుంటుంది.
 ఓ జగన్మాతా తల్లీ! సర్వావయముల నుండి అమృత రసమును వర్షించుచున్న నిన్ను, ఏ సాధకులు అయితే చంద్ర.... కాంతి.... మణి.... నిర్మిత దేహముగల ప్రతిమవలే(స్పటికము వంటి కాంతి కల రూపుముతో) తన హృదయమందు ప్రతిష్టించుకుని ధ్యానించునో వారికి గల అన్ని రోగముల నుండి తన అమృత ధారల చే,
స్వస్థత చేకూర్చెదవు !
🪷***🪷*🪷🪷***🪷
తాయారు 🪷
  ,

కామెంట్‌లు