క్రొత్త వత్సరం;- డా. అరుణకోదాటి
వచ్చింది   వచ్చింది   క్రొత్త వత్సరం
ఆశల  చిగుర్లు చిగురించిగా,
ఆశల పల్లకి లో ఊరేగుతూ
ఆనందాలని  పంచగా వస్తుంది , వచ్చిoది 
క్రొత్త సంవత్సరం,

పాత సంవత్సరానికి వీడ్కోలు  పలుకుతూ  కొత్త సంవత్సరానికి  స్వాగతం  పలుకుతూ,
వస్తుంది , వస్తుంది  నూతన సంవత్సరం,

పాతలోని విషాదలను  మరిచి
ఆనంద జ్ఞాపికలను   మదిలో  పదిలంగా
దాచుకుంటూ
స్వాగతం  పలుకుదాం  సంతోషంగా!

ఆశ మనిషికి  ప్రాణాన్ని  నిలిపే  ఊపిరి,
రాబోయే సంవత్సరంలో  
అందరికీ  శుభాలే జరగాలని ఆశిద్దాము,

 "నా " అనే  స్వార్థం  వీడి  "మనం " అనే
ఆలోచన కలిగి
అందరితో స్నేహ భావంతో  సంఖ్యత ను పెంచుకుంటూ  ఉంటే,
శాంతి కలిగి 
దేశమే  సద్బావనతో నిండిపోదా!
జీవితానికి  కావాలి ప్రణాళిక
మనజీవితానికి  ఆరంబిద్దాం   నూతన సంవత్సరం రోజునుండే  క్రొత్త క్రొత్త  ప్రణాళికతో,
ఆరంభించి  సాగిద్దాం  క్రొత్త జీవితాన్ని,
ఉండాలి  జీవితం  నిత్య నూతనంగా
ఆరోగ్య అయిశ్వర్యంగా,
అని కోరుకుంటూ 
ఎంతో  మంది నూతన  సంవత్సరాన
జరుపుకునే  పుట్టిన రోజు  జరుపుకునే  వారికీ  శుభాకాంక్షలు
అందరికీ  నూతనసంవత్సర  శుభాకాంక్షలు.. పలుకుతూ జయీ భవ, విజయీ భవ!💐

కామెంట్‌లు