మహిళా శక్తి! అచ్యుతుని రాజ్యశ్రీ

 ఇస్రో కి చెందిన నిగార్ షాజీ 35 ఏళ్ళు గా పనిచేస్తున్న శాస్త్రవేత్త.సూర్యమిషన్ లో ఆమె పాత్ర అద్భుతం.తమిళనాడుకి చెందిన షాజీ భారతీయ రిమోట్ సెన్సింగ్ ఇంటర్ ప్లానెటరీసెటిలైట్ ప్రోగ్రాం లో ఎన్నో బాధ్యత బరువులు నిర్వహించారు.చంద్రయాన్ లో మూడు మిషన్లలో తానేంటో నిరూపించారు.రైతుకుటుంబంలో పుట్టిన ఈమె తమిళనాడు లోసెన్ గొట్టయ్ లో చదువు ప్రారంభించారు.12వక్లాస్ దాకా ప్రభుత్వ బడిలో చదివి టాప్ ర్యాంక్ పొంది బి.ఇ.తర్వాత రాంచీలో పి.జి.చేశారు.బెంగుళూర్ ఇస్రోలో టెలీమెట్రి సెంటర్ చీఫ్ గా ఉన్న ఈమె సూర్య మిషన్ ఆదిత్య ఎల్1లోనిగార్ షాజీ ప్రముఖ పాత్ర వహించారు.రైతులను కన్నీటి సంద్రంలో పెడుతున్న కేరళలోని వరదలకు ప్రొఫెసర్ లిజీ అబ్రహాం తిరువనంతపురం లో విమెన్స్ కాలేజీ లో పనిచేస్తున్నారు.అలాగే స్పేస్ క్లబ్ కి కి ఆర్డినేటర్ గా పనిచేస్తున్నారు.150మంది అమ్మాయిలతో వియ్ శాట్ ఉపగ్రహంని శ్రీహరికోట నుంచి కక్ష్యలోకి పంపారు.అంతా ఆడవారితో తయారైన మొదటి భారతీయ ఉపగ్రహం ఇది.విమెన్ ఇంజనీర్డ్ శాటిలైట్ ని "వియ్ శాట్" అని పేరు పెట్టారు.అతినీలలోహిత కిరణాలను అధ్యయనం చేస్తుంది ఇదిఅయోధ్యలో మిషన్ మహిళా సారధి లో51మంది మహిళా బస్సు డ్రైవరు కండక్టర్లు బైలుదేరారు.యు.పి.లో పోలీసు ఇతరశాఖల్లో దాదాపు ఒకటిన్నర లక్షల మంది ఆడవాళ్ళు పనిచేస్తున్నారు🌹
కామెంట్‌లు