తిరుప్పావై ; వరలక్ష్మి యనమండ్ర
28వ పాశురం --
**********
కఱవై చ యాముడై యోమ్ కుజైవోన్లు మిల్లాదగోవిన్దా! ఉన్టన్నోడు ఉఱవేల్ సమక్కు ఇంగోళిక్క వోళియాదు అణియాద పిళ్ళైగాళోం అన్బినాల్, ఉన్జన్నై? శిరు ఇటైవా నీ తారయి పరమేలో రెంబావాయ్.
**********
భావము ----పంచపదులలో
*********
నియమనిష్టలు తెలియనివారము
పశువులు కాసే పశులకాపరులము
వివేకమన్న దసలు లేని వారలము
గొల్లకులమున మేము జన్మించాము
నీతో స్నేహము మా అదృష్టం కన్నయ్యా!

ఎంత పుణ్యమో నీదర్శనభాగ్యము
భాగ్యము కాదా మాతో జననము
తెంచిన మనదీ తెగని బంధనము
ఎంత ధన్యమో యాదవ కులము
నీతో క్రీడలు మా యదృష్టము..కన్నయ్యా

మర్యాదలు మేమెరుగనివారము
పేరుతోటె నిను  పిలుచువారలము
మా దోషములన్నీ మన్నించుము
నీ కృప సదా మాపై వెదజల్లుము
వ్రతము జేయగ దీవెనలను యిమ్ము
..కన్నయ్యా
***********


కామెంట్‌లు