సౌందర్యలహరి;- కొప్పరపు తాయారు
   🌻శంకర విరచిత🌻
  
తటిల్లేఖాతన్వీం తపనశశివైశ్వానరమయీం
నిషణ్ణాం షణ్ణామప్యుపరి కమలానాం తవ కలామ్ ।
మహాపద్మాటవ్యాం మృదితమలమాయేన మనసా
మహాంతః పశ్యంతో దధతి పరమాహ్లాదలహరీమ్ ॥ 21 ॥
భవాని త్వం దాసే మయి వితర దృష్టిం సకరుణా-
మితి స్తోతుం వాంఛన్ కథయతి భవాని త్వమితి యః ।
తదైవ త్వం తస్మై దిశసి నిజసాయుజ్యపదవీం
ముకుందబ్రహ్మేంద్రస్ఫుటమకుటనీరాజితపదామ్ ॥ 22 ॥
21) తల్లీ! జగన్మాతా! భగవతీ ! మెరుపుతీగ వలె దీర్ఘమై సూర్య చంద్రాగ్ని రూపమై, క్షణం వెలిగేది గా ఉండి, పద్య క్రమముకు పైన సహస్రారము నందు మహా పద్మాటవి లో, కొలువై యున్న  నీ సాధాఖ్య కలను పరిపక్వ చిత్తులూ, సంసారమాయెను జయించిన జితేంద్రియులైన, మహనీయులు మాత్రమే పరమానంద లహరి గా తెలుసుకోగలుగు చున్నారు. నిరంతరమూ, ఆనందమును పొందుచున్నారు.
22) తల్లీ! భవానీ! ముకుందా, బ్రహ్మేంద్రుల వారి
రత్నమయ కిరీటములతో నీ పాధ పద్మములకు, హారతి పట్టి నీ సాయుధ్య పదవిని కోరుచున్నారు.
నేను, నీ దాసుడను నన్ను కటాక్షింపుము. అని భక్తుడైన, ఉపాసకుడు ప్రార్థించబోయి,
తల్లీ ! భవానీ! అంటూ తన మనసులోని భావాలను మాటలలో చెప్పబోవుచుండగా నే అతని భక్తికి మెచ్చి, నీ అప్పారా కరుణను అతని పై వర్షించి అతనికి నీవు నీ సాయుద్య పదవిని అయాచితంగా
ప్రసాదిస్తావు.   
 🪷***🪷*🪷🪷***🪷
  
తాయారు 🪷

కామెంట్‌లు