శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది )-ఎం. వి. ఉమాదేవి
186)సురానందః -

దేవతలకు ఆనందకారకుడు
దివ్యమైన సంతోషమిచ్చువాడు
మోదమునందు చేర్చువాడు
తరగని శాంతినిచ్చెడువాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు!ఉమా!
187)గోవిందః -

గోవులను రక్షణచేయువాడు
గోపాలుడై అవతరించినవాడు
గోవుల సమీపమిష్టపడువాడు
గోసమూహముకు పాలకుడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
188)కోవిదాం పతిః -

వాగ్విదులకు ప్రభువైనవాడు
వేదవేద్యులకు గురుసమానుడు
జ్ఞానకోవిదులకు ముఖ్యుడు
ఋషిపుంగవుల్లో శ్రేష్ఠమైనవాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
189)మరీచిః -

తేజోవంతులలో ఘనమైనవాడు
కిరణములను పోలినట్టివాడు
వెలుగులలో నిండినవాడు
కాంతితో ప్రభవించునట్టివాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
190)దమనః -

బాధ్యతలేకున్న శిక్షించువాడు
సోమరులను దండించువాడు
గుణహీనులకి బుద్ధిచెప్పువాడు
దండనము చేయగలవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )

కామెంట్‌లు