సౌందర్యలహరి; కొప్పరపు తాయారు
 🌻శ్రీ శంకరాచార్య విరచిత 🌻 

తవ స్వాధిష్ఠానే హుతవహమధిష్ఠాయ నిరతం
తమీడే సంవర్తం జనని మహతీం తాం చ సమయామ్
ఇలాయదాలోకే లోకాన్ దహతి మహతి క్రోధకలితే
దయార్ద్రా యా దృష్టిః శిశిరముపచారం రచయతి ॥ 39 ॥

తటిత్త్వంతం శక్త్యా తిమిరపరిపంథిఫురణయా
స్ఫురన్నానారత్నాభరణపరిణద్ధేంద్రధనుషమ్ ।
తవ శ్యామం మేఘం కమపి మణిపూరైకశరణం
నిషేవే వర్షంతం హరమిహిరతప్తం త్రిభువనమ్ ॥ 40 ॥
39) ఓ జననీ! ఏ నీ స్వాధిష్ఠానచక్రంలో అగ్ని తత్వాన్ని అధిష్ఠానం లో ఉంచడానికి గాను, ఏ సంవర్తాగ్ని తేజరిల్లుతూ ఉంటుందో ఆ మహత్తర సమయా దేవిని నేను స్తుతిస్తున్నాను. మహా క్రోధం తో సంవర్తాగ్ని లోక సర్వస్వాన్ని దగ్ధం చేయబూనిన నాడు, ఆ సమయా దేవి నిజ దయార్ద్ర దృష్టితో  శీతలోపచారాలు చేస్తుంది కదా తల్లీ !
40)
        తల్లీ! నీ మణిపూర చక్రము నుండి ఎందలి చీకటిని బాపగల విద్యుద్రూపశక్తితో గూడి , పలుదెరగుల రత్నపు సొమ్ముల చే గల్పింపబడిన,
ఇంద్రధనస్సు కలిగియున్న, శివుడనే ప్రళయానలముచే కాల్చబడిన జగత్తును తడిపి చల్లబరుచుచున్న యనిర్వాచ్య మహిమగల వార్షుక
మేఘమును (సదాశివుని) సేవించెదను.!!!
                       **🪷***
తాయారు 🪷

కామెంట్‌లు