ఆర్థిక బకాయిలను సత్వరమే చెల్లించాలి.

 రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయుల పి.ఎఫ్, ఎ.పి.జి.ఎల్.ఐ, సరెండర్ లీవ్, పి.ఆర్.సి, డి.ఎ.ల బకాయిలు దాదాపు 18,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం బకాయిపడిందని, వాటిని తక్షణమే విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యుటీఎఫ్) రాష్ట్ర కార్యదర్శి రెడ్డి మోహనరావు డిమాండ్ చేసారు. రాష్ట్ర వ్యాప్తంగా పోరాట కార్యక్రమంలో భాగంగా ఈ నిరసన కార్యక్రమాన్ని రాజాం తాలూకా కేంద్రంలో నిర్వహించారు. తాము నెల నెలా దాచుకునే డబ్బులు తమకు చెల్లించడానికి తాత్సారం దేనికని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాజాం ఎల్ఐసి కార్యాలయం నుండి, బొబ్బిలి రోడ్ మీదుగా పాలకొండ కూడలి వరకు జరిగిన ఈ నిరసన ర్యాలీలో నోటికి నల్ల రిబ్బన్ కట్టుకొని తమ నిరసనను వ్యక్తం చేసారు. అనంతరం పాలకొండ కూడలి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి పక్కి వాసు, బాణాన రామినాయుడు, యుటిఎఫ్ రాజాం డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు గేదెల రమేష్, గిరడ చంద్రశేఖర నాయుడు, రాజాం మండల శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మువ్వల రమేష్, బలివాడ నాగేశ్వరరావు, గురువాన విష్ణు, పి.సత్యంనాయుడు, డోల కృష్ణారావు, పి.గౌరీశంకర్, సీనియర్ నాయకులు కురిటి బాలమురళీకృష్ణ, డి.వెంకటరావు, ఎ.దామోదరరావు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు