పండుగ. డా.పివిఎల్ సుబ్బారావు.
ముచ్చటైన మూడు!  పండుగలు!
         శుభాకాంక్షలతో!
==========================
ఆనందం గుండెల నిండి,
 పొర్లి పోతుంటే ప్రతిపొద్దు, పండుగే !

వసంతానికి ఆది ఉగాది! 

రఘువంశ పూర్ణ చంద్రమ, కళ్యాణం శ్రీరామనవమి!

సమస్త విఘ్న హరగతి,
 సిద్ధి వినాయక చవితి!

 నవ దేవి వైభవం ,
        దసరా సంబరం!

 చైతన్య జ్యోతుల కేళి,
         ఆనంద దీపావళి!

 పల్లెల వెలుగు,
పెద్ద పండుగ మెరుపు !

జనాల పీడలన్నీ,
 భోగి మంటల జ్వలనం!

 పంటల సంక్రాంతి ,
       రైతన్న కన్నుల కాంతి! 

మూగజీవుల ఎడల, పరమ,
   ప్రేమ కనుమా, కనుమ!

నాడు, ఈనాడు, ఏనాడు,  
   పండుగ నిత్య నూతనం! 

అందరినీ కలిపే ,
కాలాన ఉదయించే శుభదినం! 

కలిసి ఉంటే కలదు సుఖం, అనుభవ నిర్వచనం! 

పండగలను వదులుకోకండి, మనవారందరినీ కలవండి! 

నూతన వస్త్రాలు ధరించండి! 

నవరుచుల్ని అందించండి!

అభిరుచుల్నిపంచుకోండి!

 ఇదో కాలమిచ్చిన అవకాశం,  ఉత్సాహంగా కదలిరండి!

 ప్రతి పండుగనాడు రాబోయే, పండుగకి ఆహ్వానం పలకండి!
_________
శ్రీమతి కూరాడ వీరమాత, డా.పివిఎల్ సుబ్బారావు.

కామెంట్‌లు