పితృ భక్తి!.. అచ్యుతుని రాజ్యశ్రీ

 బాగ్దాద్ పాలకుడు స్వతహాగా చాలా మంచివాడు.అతనిపేరు హారూన్ రషీద్.ఓసారి కోపంతో వజీర్ అతని కొడుకు ను జైల్లో పెట్టాడు.వజీర్ కి చల్లటినీరు పడదు.దగ్గు జలుబు చేస్తుంది అంటే ఎలర్జిక్ ఆస్త్మా నేటి భాషలో చెప్పాలంటే.మొహం కడగటానికి వేరు నీరు దొరకదు.ఖైదీలకు రాత్రి పూట ఓలోటా నీరు ఇచ్చే వారు.ఆకొడుకు ప్రేమ చూడండి.రాత్రి తమ గదిలో వెలుగు తున్న దీపంపై ఉంచే వాడు.ఆనీరు వెచ్చగా అయ్యేవి.తెల్లారినాక ఆలోటానీటితో వజీర్ మొహంకడుక్కునేవాడు.కొడుకు ఫజల్ చేస్తున్న పని జైలు అధికారికి తెల్సి రాత్రి పూట ఆధీనం పెట్టనీయకుండా కట్టడి చేశాడు.పాపం తండ్రి దగ్గు ఆయాసం రొప్పు తో బాధ పడటం చూసిన ఫజల్ రాత్రంతా ఆలోటాని తనపొట్టకి ఆనించుకునేవాడు.తెల్లారాక ఆనీటితో తండ్రి మొహం కడిగే వాడు.రాత్రంతా లోటా కదిలి నీరు ఒలికి పోతుందేమో అనే భయంతో ఆయువకుడు అలా కూచునే ఉండేవాడు.జైలు అధికారికి ఈ సంగతి తెల్సింది.అతని గుండె కరిగి వజీర్ కి వేడినీరు అందే ఏర్పాటు చేశాడు.పాదుషా అకారణంగా శిక్ష విధించినా  మానవత్వంతో అధికారి ప్రవర్తించిన తీరు ప్రశంసనీయం.వజీర్ వల్ల ఉద్యోగం పొందాడు.కొడుకు ఫజల్ పితృ భక్తి అతన్ని కదిలించింది.కానీ నేడు వృద్ధుల పని ఎంత హీనంగా మారిందో మనం చూస్తున్నాం.🌹
కామెంట్‌లు