ఉమ్మడి రాష్ట్రస్థాయి పాటల పోటీల్లో ఈర్ల సమ్మయ్య ప్రతిభ


 నల్లగొండ జిల్లాకు చెందిన ఎరెడ్ల రంగనాయకమ్మ, ఝాన్సీరెడ్డి మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తెలుగు ఉభయ రాష్ట్రాల స్థాయి పాటల పోటీలో పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య ప్రతిభ కనబరిచి తృతీయ స్థానంలో నిలిచారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జనవరి 14 నుంచి 25వ తేదీ వరకు ఉమ్మడి రాష్ట్రస్థాయి పోటీలను ఆన్లైన్లో నిర్వహించగా, ఇందులో సత్యనారాయణ (రాజమండ్రి) ప్రథమ, సుష్మ (హైదరాబాద్) ద్వితీయ, ఈర్ల సమ్మయ్య (పెద్దపల్లి) తృతీయ స్థానాల్లో నిలిచారు. యూట్యూబ్లో వచ్చిన వ్యూస్ ఆధారంగా ఈ ఎంపిక చేసినట్లు నిర్వాహకులు కమలాకర్ రెడ్డి తెలియజేశారు. సత్యనారాయణకు 3440, సుష్మకు 2098, ఈర్ల సమ్మయ్యకు 2097 వ్యూస్ వచ్చాయి. తెలుగు ఉభయ రాష్ట్రాల స్థాయి పాటల పోటీలో ఈర్ల సమ్మయ్య 'విజ్ఞానంతోనే వికసించు జగత్తు' అనే పాట పాడి, తృతీయ స్థానంలో నిలిచినట్లు పాటల పోటీ నిర్వాహకులు ఎరెడ్ల కమలాకర్ రెడ్డి తెలిపారు. పాటల పోటీలో తృతీయ స్థానంలో నిలిచిన ఈర్ల సమ్మయ్యకు శనివారం ఆయన ప్రశంసా పత్రంతో పాటు రూ.1116 నగదు  అందజేశారు. తన గెలుపుకు సహకరించిన మిత్రులు, శ్రేయోభిలాషులు, ప్రతి ఒక్కరికీ ఈర్ల సమ్మయ్య కృతజ్ఞతలు తెలియజేశారు.
కామెంట్‌లు