పుష్పలతకు సావిత్రిబాయిపూలే జయంతి సత్కారం

 వోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో 
భారతీయ తొలి ఉద్యోగిణి సావిత్రి బాయి పూలే జయంతిని పురస్కరించుకుని, 
జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను  
ఇన్ ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు గోగుల సూర్యనారాయణ అధ్యక్షతన ఘనంగా జరిగాయి.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు రెండు శతాబ్దాల క్రితమే బాలికలపట్ల వివక్షను, మూఢనమ్మకాలను, బాల్యవివాహాల వంటి దురాచారాలను నిలదీసి, ఎన్నో బాలికల పాఠశాలలను స్థాపించిన 
మహిళాశక్తి సావిత్రిబాయి పూలే అని అన్నారు. తొలుత ఆయన సావిత్రి బాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పాఠశాలలో ఉపాధ్యాయనిగా పనిచేస్తున్న దానేటి పుష్పలతను శాలువా, జ్ఞాపిక, కానుకలతో  ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఇన్ ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు గోగుల సూర్యనారాయణ, ఉపాధ్యాయులు దానేటి పుష్పలత, సిద్ధాబత్తుల వెంకటరమణ, కుదమ తిరుమలరావులు పాల్గొని సావిత్రి బాయి పూలే జీవితాశయాలను వివరిస్తూ ప్రసంగించారు. కుదమ తిరుమలరావు మహిళా చైతన్య గీతాలను ఆలపించారు. 
అనంతరం విద్యార్థులకు మిఠాయి పంపకం జరిగింది.
కామెంట్‌లు