ఎన్ని నదులు కలిసి
ఎన్ని సముద్రాలు ఏర్పడేనో !
ఎన్ని మేఘాలు కురిసి
ఎన్ని నదులు పొంగేనౌ!!!
ఎంత భూమి కుంగి
ఎన్ని లోయలు ఏర్పడేనౌ!!
ఎన్ని చెట్లు నేలకొరిగి
ఎన్ని రహదారులు ఏర్పడేనో!!!
ఎన్ని అరణ్యాలు మండి
ఎంత భూమండలం బూడిదాయనో!!
ఎంత భూతలం ఎండకు ఎండి
ఎన్ని ఎడారులు ఏర్పడేనో!!!
ఎన్ని నదుల వెంట ఎన్ని నాగరికతలు వెలిగి
మిగిలిపోయెనో!!!
ఎన్ని కోటలు కూలి ఎంత మంది రాజులు
నేలకొరిగిరో!!?
ఎంతమంది సామాన్యులు
సామాన్య కారణాలతో భూస్థాపితమైనారో!!
ఆమె రాకతో
ప్రేమ సామ్రాజ్యం ఏర్పడింది.!!
ఆమె రాకతో
తెల్లని శాంతి పావురాలు రెండు
మళ్లీ ఆకాశంలో ఎగురుతున్నవి!!!?
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి