అమ్మ మనసు - చంద్రకళ యలమర్తి
తిశ్రగతిలో
చిరంజీవ రదీఫ్ తో
================
అమ్మ మనసు అమృతమే 
కురిపించును చిరంజీవ 
అనునిత్యం నీకోసమె
తపియించును చిరంజీవ 

నిన్నుకన్న తల్లి కదా 
ఆమెఋణం తీర్చలేవు 
తనరక్తం కడవరకూ 
చిందించును చిరంజీవ 

చక్కగాను ఎదగాలని 
 గెలవాలని కోరుతుంది 
పూజలనే చేసిమురిసి 
దీవించును చిరంజీవ

మంచిపనే తలపెడితే
నీకెప్పుడు ఎదురుండదు
ఓపికగా నిలబడితే
జయమందును చిరంజీవ

చంద్రునిలా చల్లగుండు 
నీశాంతమె నీకు రక్ష 
శక్తి కొలది పాటుపడితె 
సుఖమందును చిరంజీవ
**


కామెంట్‌లు