తిరుప్పావై ;- కొప్పరపు తాయారు
  🌻25వ, పాశురం 🌻  
ఒరుత్తి మగనాయ్ పిఱన్దు  ఓరిరవిల్ 
ఒరుత్తి మగనాయ్ ఒళిత్తు  వళర
తరిక్కిలా  నాగిత్తాన్ తీజ్గు నినైన,
కరుత్తెపిళ్ళైకఱ్ఱన్  వయిట్రిలా 
నెరుప్పన్న  నిన  నెడుమాలే !యున్నై 
అరుతిత్తు  వన్డోమ్ ,పణ్ణైతరుతియాగిల్ 
తిరుర్రక్కు శెల్వముమ్ శేవగముమ్ యా మ్పాడి
వరుత్తముమ్ తీర్ న్దు మగిళిన్దు. ఏలో 
 రెమ్బావాయ్ 
ఓ కృష్ణా! పరమభాగ్యమతి అగు శ్రీ దేవకీ దేవి ముద్దుల పట్టిగ అవతరించి, అదే రాత్రి శ్రీ యశోదాదేవికి అల్లారు ముద్దుబిడ్డ వై రహస్యముగా
శుక్లపక్షం చంద్రుని వలె పెరుగుచుండగా గూడచారుల వలన ఈ విషయం నెరిగి కంసుడు నిన్ను మట్టు పెట్టుటకు ఆలోచించుచుండగా అతని యత్నములు అన్నిటిని వ్యర్ధము చేసి అతని గర్భమున చిచ్చు పెట్టినట్లు నిలిచిన భక్తవత్సలుడవు! అట్టి నిన్ను భక్తి పూర్వకముగా ప్రార్థించి నీ సన్నిధికి చేరినాము. మాకు ఇష్టార్థమైన 'పఱ'  అను వాద్యమును. అనుగ్రహింపుము.
      ఇట్లు ఇట్లు అనుగ్రహించిన శ్రీ లక్ష్మీ దేవి యాస పడదగిన సంపదను దానిని సార్థక పరచు నీ శౌర్యమును కొనియాడి నీ  విశ్లేషముల వలన కలిగిన సంకటమును నివారణ చేసుకుని మేము సుఖింతుము. నీ విట్లు కృపచేయుట వలన మాయీ అద్వితీయ మైన వ్రతం శుభముగ సంపూర్ణమగును.
🪷****🪷****🪷
                       

కామెంట్‌లు