తిరుప్పావై- వరలక్ష్మి యనమండ్ర
 26వ రోజు పాశురం
***********
మాలే! మణివణ్ణా! మార్గళి నీరాడువాన్; మేలైయార్ శేయ్యనగళ్ ; వేణ్ణువన కేట్టియేల్; ఇ లతై యెల్లామ్ నడుజ్ఞ మురల్వన పాలన్న శజ్ఞజ్ఞళ్, పోయ్ ప్పాడు డైయనవే, శాలప్పేరుమ్ పఱియే, పల్లాణ్ణిశైప్పారే, కోలవిళక్కె, కోడియే, వితానమే, ఆలినిలై యామ్! ఆరుళేలో రెమ్బావాయ్.
***********
    భావము...పంచపదులలో
***********
26వ రోజు పాశురము..భావము

ఇంద్రనీలమణి వర్ణము వాడా కన్నయ్యా
ఆశ్రితులపట్ల వ్యామోహితుడా కన్నయ్యా
ఏమి కావాలో అడగమంటివిగ కన్నయ్యా
వటపత్ర శాయి స్నేహముకోరితి కన్నయ్యా
స్నానవ్రతమును చేయుచుంటిమికన్నయ్యా.. కృష్ణా

తరతమ భేదము లెంచనివాడా కన్నయ్యా
భక్తితో భేదమునెంచక కోరెద కన్నయ్యా
పాంచజన్యమంటి శంఖాలు కావలె కన్నయ్యా
లక్షలాదిగా కావలయునవి మాకు కన్నయ్యా
మేలుకొలుపులకు సంకీర్తనలకూ కన్నయ్యా.. కృష్ణా

మంగళ దీపము కావలయును ఓ కన్నయ్యా
గరుడ ధ్వజముయు కావలయును కన్నయ్యా
గానము చేయ గాయకులు వలయు కన్నయ్యా
లోకములన్నీ నీలో దాచిన లోకోద్ధార కన్నయ్యా
నీకూ మూకూ భేదము చూపవుగ కన్నయ్యా.. కృష్ణా
***********


కామెంట్‌లు