ఉపాయంతో తప్పిన అపాయం;- - బోగా పురుషోత్తం, తుంబూరు

 . ఓ అడవిలో కుందేలు తన నాల్గు పిల్లలతో ఓ ఇల్లు నిర్మించుకుని నివసించేది. ఓ రోజు ఆ అడవికి బాగా దూరంగా మేతకు వెళ్లింది తల్లి కుందేలు.
 దాని పిల్లలకు బాగా ఆకలి వేసింది. తల్లికోసం ఇంటి తలుపులు తెరచి ఎదురు చూడసాగాయి.
  సాయంత్రం అయ్యింది. తల్లి కుందేలు ఇంటికి చేరలేదు. పిల్ల కుందేళ్ల మనసులో అలజడి మొదలైంది. చీకట్లో వాటికి నిద్ర పట్టక తల్లి కోసం వేయి కళ్లతో ఎదురు చూడసాగాయి.
   దూరంలో నక్కల అరుపులు వినిపించాయి. నక్కలు తమను తినివేస్తాయని భయపడ్డాయి. తలుపులు వేసుకున్నాయి.
   నక్క రానే వచ్చింది. ఓ కుందేలు ఇంట్లో తలుపుల కన్నం లోంచి బయట ఏమి జరుగుతోందో గమనించ సాగింది.
  నక్క నెమ్మదిగా తల్లి కుందేలు గొంతుతో ‘‘ పిల్లలూ తలుపు తీయండి..’’ అని అరవసాగింది.
 ఓ కుందేలు నిజంగా తన తల్లి వచ్చిందని తలుపు తెరిచింది. ఎన్నో రోజులుగా ఆహారం లేని ఆ నక్క ఒక్కసారిగా వాటిపైకి దూకింది. అవి భయంతో వణికిపోయి నలు దిక్కులా పరుగుపెట్టాయి. వాటి వెనుకే పరిగెత్తింది నక్క.
    కొయ్యలతో చేసిన ఆ చెక్క ఇంట్లో చేసిన అరుగుపైకి ఎక్కి కూర్చుంది వాటిలో పెద్ద కుందేలు. కిందే వున్న చిన్న కుందేలు  
పీక పట్టుకోబోయింది నక్క.. అటకపై వున్న కుందేలుకు వెంటనే మెరుపులాంటి ఆలోచన మెరిసింది.
   ‘‘ ఓ కుందేలు బావా.. కుందేలు బావా..నీ చెరువంత పొట్టకి ఈ చీమంత ఆహారం ఏం సరిపోతుంది..?రా.. ఆ పక్కనే ఓ నీటి గుంట వుంది.. అక్కడికి ఓ పెద్ద ఆవు వసుÊంది..వాటి వెనుకే మనుషులు కూడా వస్తారు. నువ్వు కడుపు నిండా తినొచ్చు..’’ అంది పెద్ద కుందేలు.
   నక్కకి నోరు ఊరింది. ఎగిరి గంతేసింది.‘‘ సరే వెళదాం పద..తొందరపెట్టింది.. అప్పటికే తెల్లారుతోంది. కుందేలు వెనుకే నడిచింది నక్క. నీటి గుంట గుంట వద్దకు వెళ్లిన నక్కకు  ఎదురుగా వస్తున్న ఒంటరి ఆవుపైకి  ఉ రకపోయింది.
   కుందేలు ‘‘అయ్యో ఈ ఒక్క ఆవుకే అంత ఆశపడటం దేనికి? అటు చూడు..ఆ పక్క వంద ఆవులు వున్నాయి..ఆ వెనుకే మనుషులు కూడా వున్నారు.. పసందైన విందు భోజనం ..రా గుంటను దాటుకుని వెళదాం..’’ అంది కుందేలు.
     నక్క ఉ త్సాహంతో ూరకలు వేస్తూ నీటి గుంటలోకి దిగింది. కొద్ది సేపటికే అందులో వున్న మొసలి నోటికి చిక్కి గావుకేక పెట్టింది నక్క.. అది అరుస్తుంటే ఆనందం పట్టలేక తమ ప్రాణాలు  దక్కినందుకు ఎగిరి గంతేశాయి కుందేళ్లు. ఆ వెనుకే వచ్చిన తల్లి కుందేలు అది చూసి తన పిల్ల తెలివితో పిల్లలందరిని కాపాడినందుకు  ‘‘ శభాష్‌’’ అని మెచ్చుకుంది. వాటి సంబరం చూసి అక్కడే వున్న అక్కడే వున్న మనుషులు వాటి వద్దకు వచ్చారు. ఇన్నాళ్లు తమ పశువులకు హాని కలిగిస్తున్న నక్క బెడదను కుందేలు ఉ పాయంతో తప్పించినందుకు  మెచ్చుకున్నారు.

కామెంట్‌లు