శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది )ఎం. వి. ఉమాదేవి
71)హిరణ్య గర్భః -

రమణీయస్థానమునుండువాడు 
స్వామి తానైన పరంధాముడు
సంపూర్ణ ఆనందమిచ్చువాడు
చతుర్ముఖునికి ఆత్మయైనవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
72)భూగర్భః -

భూమిని ధరించినవాడు
కడుపునబెట్టుకొనువాడు
నిత్యమూ కాపాడెడి వాడు
విశ్వముకు పుట్టిల్లయినవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు!ఉమా!
73)మాధవః -

శ్రీలక్ష్మీదేవికి భర్తయైన వాడు
మధువిద్యామౌనధ్యానకుడు
యోగద్వారా తెల్సుకోబడ్డ వాడు
జ్ఞానప్రభు పరమాత్మకుండు
వేరుప్రభులేని మధువంశకుడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
74)మధుసూదనః -

మధుకైటభ సంహారకుడు
బంధకారణముల నాశకుడు
కర్మఫలం తొలగించువాడు
మధురమైన నామములవాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
75)ఈశ్వరః -

సర్వులనూ పాలించేవాడు
అన్నిటినీ పోషించగలవాడు
సకలాధిపత్యం గలిగినవాడు
ఏ ప్రమేయమూ లేనివాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!

కామెంట్‌లు