బడే మనకు గుడి--సి.హెచ్.ప్రతాప్

 అందమైన దేవాలయం బడి , జీవితం లో ఎదిగేందుకు మహోన్నతమైన వ్యక్తిత్వం సాధించేందుకు భౌతికమైన కోర్కెలను తీర్చుకునేందుకు వల్సిన అర్హతలను అందించునది బడి . బడి ప్రభావం మనపై ఇంతింత కాదయా !
అ, ఆ లు దిద్దించే స్థితి నుండి పి హెచ్ డి వంటి ఉన్నతమైన డిగ్రీ లను అందించు పరమ పవిత్ర దైవ సన్నిధానం బడి.
మానవ జీవితాన్ని తీర్చి దిద్దే బడిని అపవిత్ర మొనర్చుట క్షమించ రాని నేరం. ప్రేమ కలాపాలు, అత్యా రాలు,దౌర్జ్యనాలు,
లైంగిక వేధింపులు మితి మీరి పోవుట శోచనీయం. చదువుల తల్లి సరస్వతికి వ్యధ కల్గించుట బాధాకరం. మానవులను మహనీయులుగా తీర్చి జీవితం లో మహోన్నతమైన శిఖరాలను అధిరోహింపజేసే బడి ఋణం ఎన్నటికీ తీర్చుకోలేనిది
బడియే మనకందరకు గుడి .బడి లో ఆహ్లాదకర వాతావరణంలో పాఠాలు బోధించేందుకు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. చదువు తప్ప అన్య విషయాలకు అక్కడ తావుండకూడదు. ప్రతీ బడి సరస్వతీ ఆలయం అనే అవగాహనను విధ్యార్ధులలో కలుగజేయాలి. పిల్లలను బడి కి పంపండి, వారి భవిష్యత్ కు బాటలు వేయండి.
గుడికి వెళ్తే భక్తుడు ఔతాడు  బడికి వెళ్తే యుక్తుడు ఔతాడు అన్నది పెద్దల మాట. ఎన్ని ఉన్న , చదువు లేకుంటే  జీవితం సున్న. ఆడ మగ తేడా వద్దు , అందరికీ  చదువే ముద్దు.బాలల చదువు , భవితకు వెలుగు. చదువుకునే పిల్లలు , వెలుగు నిచ్చే దివ్వెలు లాంటి స్పూర్తిదాయక వ్యాఖ్యలను మనం మన హృదయాలలో పదిలపరచుకోవాలి.  
 
కామెంట్‌లు