పిల్లల ఆటలు గురిగిలో వంటలు (బాల గేయం)- ఎడ్ల లక్ష్మిసిద్దిపేట
చిట్టి పొట్టి పిల్లలు
కుమ్మరి మట్టి తెచ్చారు
నీళ్లు పోసి తడిపారు
చిన్న గురుగులు చేశారు !!

పుల్లలు కొన్ని తెచ్చారు
చక్కగా మంట పెట్టారు
మంటలో వేసి కాల్చారు
గురుగులు పక్కకు పెట్టారు !!

పుట్టమన్ను తెచ్చారు
చిట్టి పొయ్యిలు వేసారు
పోయ్యిలో మంట పెట్టారు
గురిగి లో వంట చేసారు !!

పిల్లలందరినీ పిలిచారు
ఇస్తరాకులు వేశారు
వండిన వంటలు పెట్టారు
బొజ్జ నిండా తిన్నారు !!


కామెంట్‌లు