:మావూరి అందాలు;- :ఆర్. రమాదేవి(రమా గోపాల్ )

 మా ఊరు భువనేశ్వర్ 
ఒడిస్సా కి మూడు గంటల కారు ప్రయాణం
అంగూల్ ప్రకృతి అందాలకి నెలవు
అంగూల్ జిందాల్ స్టీల్ అండ్ పవర్ కంపెనీ
 కంపెనీ పరిసర ప్రాంత మంతయు 
దేవ భూమిగా పరిగణిస్తారు
 అందమైన ప్రకృతి ఒడిలో
 విశాలమైన రోడ్లు ఇళ్ళు
 ప్రశాంతతకు పెట్టింది పేరుగా
 సస్యశ్యామలంగా ఉంటుందా ఊరు
 ఎటు చూసినా పాడి పంట భూములు
 కాయ కూరలు పండించడం
 అందరూ ఎవరికి కావాల్సినవి వాళ్ళుఇంటివద్దనేపండించుకుంటారు
చూడముచ్చటగావుంటుంది
 రాత్రి వేళల్లో చిక్కని చలి
వేకువఝామున మంచు తెరల
మధ్య అందాలసీమగాఅలరారుతుంది
 సూర్య భగవానుడు లేత కిరణాల మధ్య మంచు తెరల చాటు నుండి దోబూచులాడుతూ 
 మెలమెల్లగా వస్తాడు
 వచ్చిన ప్రభాకరుడికి
 ఎత్తైన చెట్లు వంగీ సూర్య నమస్కారాలు చేస్తున్నట్లు  
 ఉంటాయి
 ప్రతి ఇంటా ఉండే మందారాలు,
 చేమంతులు,పూ బంతులు
 దినకరునికిరణాలవెచ్చదనంలో
 మందిరాల్లోనూ, ఇంటి దైవాల
 పాదాల చెంత చేరడానికి
ఉవ్విళ్లూరుతూ రారమ్మని ఆహ్వానిస్తాయి
 ఇక్కడ కోతులు ఎక్కువగా ఉంటాయి
 అవి ఎవరినీ ఏమీ చేయవు
 మర్యాదని పాటిస్తాయి
 దేవ భూమి కదా
అందరూ క్రమశిక్షణనిపాటిస్తారు
 అందరికీ భక్తి ఎక్కువ
 దేవాలయాలు ఎక్కువగా ఉన్నాయి
 అన్ని దేవాలయల పరిసర ప్రాంతమంతయూ
పూలతోటల మధ్య పాల రాతితో 
కనుల పండుగగాఉంటాయనుటలో
 అతిశయోక్తి లేదు
 ఎవరికైనానచ్చే ప్రదేశం
 ఎంత నీవర్ణించెదను ఈ అంగూల్ఊరిని
కామెంట్‌లు