పొట్టేళ్ల పందెం (బాల గేయం)- ఎడ్ల లక్ష్మి-సిద్దిపేట
చుట్టం చూపుగా వచ్చారు
చెట్టు కింద ఆగారు
చుట్టాలకు కుర్చీలు వేయండి
అట్లు పోసి పెట్టండి !

పొట్లాట అసలే వద్దండి
పొట్టేలు పందెం చూడండి
కట్టెలు చేత పట్టుకుని
గట్టుమీద నిలవండి !

పొట్టి పొట్టేలు వచ్చింది
గట్టిగా పోటీలో నిలిచింది
గిట్టలు లేపుతూ ఎగిరింది
కొమ్ములిరగా పొడిచింది

పట్టుదలతో పందేన్ని
బెట్టు కట్టి చూడండి
కట్టిన బెట్టును మీరు
గెలిచిన వారికి ఇవ్వండి !


కామెంట్‌లు