రాజసూయ యాగం తర్వాత దుర్యోధనుడి కడుపు అసూయ తో కుతకుత లాడింది.ఇంద్రప్రస్థంలో పాండవుల వైభోగం చూసి తండ్రి దగ్గర భోరు భోరుమని ఏడ్చి శకుని సలహాపై ధర్మరాజుని జూదం ఆడమని ఆహ్వానించాడు.ధర్మరాజుకి ఉన్న ఏకైక బలహీనత జూదం ఆడటం. ఎవరన్నా పిలిస్తే "ఆడను" అని మొహాన కొట్టిన ట్లు చెప్పకూడదు.అది ఆయన నిష్ఠ.మోసంతో శకుని మాయాపాచికలతో ధర్మరాజు రాజ్యం తమ్ముళ్ళు తాను ఆఖరికి ద్రౌపది దేవిని కూడా పందెంలో పెట్టి ఓడిపోతాడు.దుశ్శాసనుడు ద్రౌపదిని జుట్టు పట్టుకుని సభలోకి ఈడ్చుకుంటూ వచ్చి ఆమె చీరను విప్పదీస్తుంటె కృష్ణ పరమాత్మ అభయంతో వాడు అలా ఆగకుండా వస్తున్న చీరను లాగలేక చేతులు నెప్పిపెట్టి కింద కూలబడ్డాడు.అప్పుడే భీముడు ప్రతిజ్ఞ చేశాడు " దుశ్శాసనుడిని చంపి వాడి నెత్తురు కళ్ళజూస్తాను.దుర్యోధనుడి తొడలు విరగకొడ్తాను" అని.ద్రౌపది శోకం దుస్సకునాలు కన్పడటంతో గాంధారి పరుగున సభలోకి వచ్చి భర్త ను హెచ్చరించడంతో తెలివిగా ధృతరాష్ట్రుడు ఆమెను వరాలు కోరుకోమన్నాడు.ఆమె తనభర్త ధర్మరాజు ని విడిపించమన్నది.అంటే కౌరవుల భృత్యుడు ఐనాడు అంతటి ధర్మాత్ముడు.పైగా వారి కుమారుడు ప్రతినింద్యుడు భవిష్యత్తులో కాబోయే రాజు.రెండో వరంగా మిగతాపాండవుల్ని విడిపించి మూడో వరం నాకు వద్దు అంది ద్రౌపది.రెండో సారి కొత్త షరతు ఏమంటే 12 ఏళ్ళు అరణ్యవాసం ఓఏడాది అజ్ఞాతవాసం. ఒకవేళ అజ్ఞాతంలో బైట పెడితే మళ్ళీ 12 ఏళ్ళు అరణ్యవాసం.. ధర్మం కోసం ఒప్పుకుని ఓడాడు ధర్మరాజు.కౌరవనాశనం కావాలి.అందుకే మొహాన ఉత్తరీయం కప్పుకుని కాలినడక తో సోదరులు ద్రౌపది తో బైలుదేరాడు.ఆయన కంటిచూపు పడితే వాడు భస్మం ఐపోతాడు.అలా ఎవరూ నాశనం కాకుండా ఉత్తర దిశలో ప్రమాణం అనే మర్రిచెట్టు క్రింద ఆగిపోయి గంగలో స్నానం చేశారంతా! మర్రిచెట్టు ఆకు ఎండి నేలరాలితే నీటిలో పడేస్తే తిరిగి ఆకుపచ్చ రంగు తో మెరుస్తుంది.శివకేశవుల నివాసం మర్రిచెట్టు.దక్షిణామూర్తి నివాసం.ఇక పండితులు విప్రులు పాండవుల వెన్నంటి వచ్చి " మేము మీతో మాక్రతువులు చేసుకుంటాం" అన్నప్పుడు ధర్మరాజు వారి ప్రేమ ఆప్యాయత కు చలించి పోయి తొలి సారి మూర్చపోయాడు.వారికి గృ
హస్థుగా భోజనం పెట్టాలి.కానీ అది ఎలా సాధ్యం? ఇదీ ధర్మరాజు గొప్ప తనం 🌷
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి