తిరుప్పావై ; - కొప్పరపు తాయారు
 🌻30వ,పాశురం🌻
 
  మజ్ఞక్కడైన్ద మాధవనై కేశవనై  తిజ్ఞళ్,
  తిరుగ ముత్తు చ్చేయిళై యార్ 
  శెన్నిరై. అజ్ఞాపరై  కొణ్ణువాత్తై 
   అణిపుదువై  పైజ్లమల్  
   పట్టర్ పిరా న్ కోదై శొన్న శజ్ఞతమిళ్  మాలై
   ముప్పదుమె తప్పామే  ఇన్గపరిశురై  
    ప్పారీరరణ్ణు మాల్వరైత్తోళ్  శెజ్ఞణ్ తిరు
    ముగత్తు,చ్చెల్వ తిరుమాలాల్ ఎజ్ఞమ్
    తీరు వరుళే  పెత్తిన్చురువ  రెమ్బావాయ్
ఓడలు గల పాల సముద్రమును దేవతల కోసం మధించి వారికి అమృతాన్ని అందించిన వాడును
బ్రహ్మ రుద్రాధులకు ప్రభువైనట్టి నారాయణుని చంద్రముఖులు అలంకృతులై చేరి మంగళ శాసనము 
చేసి గోకులం నందు 'పజై' అను వంకతో స్వామీ
వీరు పొందారు ఈ కైంకర్య  విధము నంతను అలంకారమైన శ్రీ విల్లిపుత్తూరులో అవతరించినట్టు యును తామర పూసల మాలలను ధరించిన పెరియాళ్ళార్ల(విష్ణుచిత్తుల) పుత్రిక అయిన గోదాదేవి
(ఆండాళ్ తల్లి) సాయించింది.  ఇది గోపికలు గుంపులు గుంపులుగా కూడి అనుభవించిన ప్రబంధమై ద్రావిడ భాషలో పాశుర రూపంగా
ప్రవహించినది.
          ఈ ముప్పది పాశురాలను ఒక్కటి కూడా విడువకుండా ఈ సంసారమున అనుసంధించు వారు గొప్ప పర్వతం వలెనున్న నాలుగు భుజములను ఆశ్రిత వాత్సల్యముచే  ఎర్రబారిన కనుదోయి గల శ్రీముఖమును ఉభయ విభూతి ఐశ్వర్యములందును గల శ్రీయః పతి యొక్క సాటిలేని దివ్యకృపను పొంది బ్రహ్మానందంతో కూడినవారై ఉండగలరు. శ్రీ గోదా రంగనాథుల అవ్యాజ కృప చే ఈ తిరుప్పావై ప్రవచనం ద్రవిడ దివ్య ప్రబంధమును తెలుగు న శ్రీ సూక్తి మాలిక గా ప్రవహింపజేసి పాడించుకున్న  వారి దివ్య వాత్సల్యమునకు ఈ దాసుడు ,రంగనాథుడుకీ ఆ జన్మ కృతజ్ఞతాంజలులు ఘటిస్తున్నాడు.
  ఆండాళ్ తిరువడి గల్. శరణం....  
  🪷******🪷**ఐ***🪷

కామెంట్‌లు