..బాల రామ నీ మందిరం;- . కోరాడ నరసింహా రావు!
ఓ బాల రామ నీ మందిరం
 చూడగా బహు సుందరం
 తలపించెను త్రేతాయుగ0
 ఇదికనివినిఎరుగనిసంబరం

చరిత్ర సృష్టి0చెను కదా
ఇది నీ భక్తుల విజయమెకదా
  పొంగెనుప్రతి హిందువు ఎదా
 గురుతుండునుకద ఇది సదా

న్యాయము కై పోరాడిరి
ధర్మమునే గెలిపించిరి
నినుబాల రామునిగఉంచిరి
కని విని ఎరుగనిది కదా ఇది
    
నీ  మందిరనిర్మాణమునకును
ప్రారంభోత్సవ వేడుక లకును
  విరివిగా కానుకలవి ఎన్నో
 ఎంద రెందరో పంపు చుండిరి
      
సాధు, సంతులు
  పురప్రముఖులు
   విదేశీయులు
 ఆనందముగా తరలి వచ్చిరి

అయోధ్య అంతా
 పండుగ కళ తో
 ధగ ధగ లాడుతు
  మెరయు చున్నది
     *****


కామెంట్‌లు