శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది )-ఎం. వి. ఉమాదేవి
151)ఉపేంద్రః -

ఇంద్రునికి సోదరుడైనవాడు
దేవేంద్ర పదవిలోనివాడు
ఇంద్రునికంటెనూ ఘనమైనవాడు
సురులకన్నను అధికుడైనవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
152)వామనః -

పొట్టిగానున్నట్టి బాలకుడు
హృదయమందు నివసించువాడు
దేవతలు ఉపాసించువాడు
వామనుడై బలినొంచినవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు!ఉమా!
153)ప్రాంశుః -

విశ్వస్వరూపము గలిగినవాడు
మిక్కిలి ఎత్తయినట్టివాడు
నింగికెగసియున్నట్టి వాడు
ఆకాశమును అందుకున్నవాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
154)అమోఘః -

వ్యర్థంకాని కార్యమున్నవాడు 
ఉపయోగకరముగా నున్నవాడు
అమోఘమైన శాసనకుడు
అమితవాక్శుద్ధి గలిగినవాడు!
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
155)శుచిః -

అత్యంత పవిత్రమైనవాడు
పూజించ దగినట్టి వాడు 
స్మరణతో శుచినిచ్చెడివాడు
స్తుతితో కాపాడుచున్నవాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )

కామెంట్‌లు