సిప్‌ అబాకస్‌లో ఛాంపియన్ గా నిలిచిన తోక వివేక్

  ఇటీవల  జరిగిన జాతీయ  రాష్ట్ర స్థాయి (జనవరి 7వ తేదీన)  సిప్‌ అబాకాస్ అర్థమెటిక్ జీనియస్ కంటెస్ట్‌-2023 (సీజన్ 8) లో హైదరాబాద్ కొంపల్లి లోని సాధువాస్వాని ఇంటర్నేషనల్ హైస్కూల్లో రెండవ తరగతి చదువుతున్న తోక వివేక్,  రెండవ తరగతి విభాగంలో సత్తా చాటారు. దేశంలోని 20 రాష్ట్రాల నుంచి 6 లక్షల మందికి పైగా విద్యార్థిని, విద్యార్థులు రాష్ట్రస్థాయిలో పోటీపడగా, మన రాష్ట్రంలోని తోక వివేక్(7 సం.లు) తెలంగాణ రాష్ట్ర (2 వ తరగతి విభాగంలో) ఛాంపియన్ గా (మొదటి స్థానం లొ) నిలిచి సిప్ అబాకస్ వారి నుంచి 10,000 నగదు బహుమతి మరియు ట్రోఫీ ని అందుకున్నారు. తదుపరి చెన్నైలో నిర్వహించిన జాతీయస్థాయి పోటీలలో  250 మంది విద్యార్థులు  పాల్గొన్నారు. ఈ పోటీలో కేవలం 10 నిమిషాలలో 300 లెక్కలు చేయాల్సివుంటుంది. హోరా హోరిగా సాగిన ఈ పోటీలో తోక వివేక్  4వ స్థానంలో నిలిచి తెలంగాణ రాష్ట్రం నుండి తన సత్తా చాటారు. కాగా, టి. వివేక్(2 వ తరగతి) విభాగంలో తెలంగాణ రాష్ట్ర చాంపియన్‌గా నిలిచారు. జాతీయస్థాయిలో(2వ తరగతి) విభాగంలో 4వ రన్నరప్‌ ట్రోఫి గెలుచుకున్నారు. ఈ సందర్భంగా సిప్‌ అబాకస్ ఎం.డి దినేష్ విక్టర్ చేతుల మీదుగా విద్యార్థి టి. వివేక్  అవార్డు అందుకున్నారు.
కామెంట్‌లు