తిరుమలరావుకు రారవే, సాహిత్య అకాడమీ సత్కారం

 వోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్రోపాధ్యాయునిగా పనిచేస్తున్న కుదమ తిరుమలరావు మరో అరుదైన గౌరవాన్ని పొందారు.రాజాం రచయితల వేదిక కన్వీనర్ గార రంగనాథం, కేంద్ర సాహిత్య అకాడమీ కన్వీనర్ సి.మృణాళిని, 
సాహిత్య అకాడమీ సభ్యులు చింతకింది శ్రీనివాసరావు, ప్రభుత్వ ఎస్టీ సంక్షేమ విభాగం చైర్మన్ మాజీ ఎంపీ డి.వి.జి. శంకరరావులు 
తిరుమలరావును జ్ఞాపికతో సత్కరించారు.ప్రముఖ రచయిత అబ్బూరి వరద రాజేశ్వరరావు శతజయంతి ఉత్సవం సందర్భంగా,
రాజాం రచయితల వేదిక  తొమ్మిదవ వార్షికోత్సవ వేదికపై ఆయన ఈ సత్కారాన్ని పొందారు. 
రాజాం రచయితల వేదిక,కేంద్ర ప్రభుత్వ సాహిత్య అకాడమీలు సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ ఈ అరుదైన సత్కారం లభించింది. 
ఈ సందర్భంగా తిరుమలరావు మాట్లాడుతూ అబ్బూరి వరద రాజేశ్వరరావు గారి రచనలను పలు అంశాలుగా విభజించి వాటిని పలువురు రచయితలు విశ్లేషిస్తూ వివరించిన ఈనాటి వేదికపై తనకు సత్కారం లభించడం మిక్కిలి ఆనందంగా ఉందని అన్నారు. 
తిరుమలరావుకు ఈ సత్కారం లభించుటపట్ల పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేసారు.
కామెంట్‌లు