తిరుప్పావై ; కొప్పరపు తాయారు
 🌻26వ, పాశురం 🌻
మాలే! మణి వణ్ణా! మార్గళినీరాడవాన్ 
మేలైయార్ శెయ్  వనగళ్  వేణువన కేట్టియేల్ 
ఇలతై యెల్లామ్ నడుజ్ఞ మురల్వన పాలన్న 
వణత్తు ఉన్ పా ఇ+-- శెన్నియ మేల్ పోల్వన 
శబ్దజ్గళ ప్పోయ్ ప్పాడుడై యనవే  శాలప్పెరుమ్ 
పలయై పల్లాణ్ణిశెప్పారే  కోలవిళక్కే కొడితే,
విధామే. ఆలినిలైయాయ్!అరుళేలో రెమ్బావాయ్
 ఆశ్రిత వ్యామోహమే స్వరూపముగా కలిగిన ఇంద్రనీలమని వంటి శరీరము కలవాడా ! ఓ వటపత్రశాయి సాయి! మార్గశీర్షమాస స్నానం చేయగా వచ్చాము. మా పూర్వులున్నూ  ఈ స్నాన వ్రతాన్ని ఆచరించి ఉన్నారు ఈ వ్రతానికి అవసరమాకు పరికరములను నిన్ను అర్థింపగా వచ్చాము దయచేసి ఆలకింపుము భూమండలం అంతయు వణుకు కలిగించు నట్లు ధ్వనించు ధ్వనించే పాంచ జన్యం వంటివి కావలెను అతిపెద్ద
వైన పఱ వంటి వాద్యములు కావలెను.
        మృదు మధురమైన కంఠములతో మంగళ గానాలను పాడే భాగవతులు కావాలి వ్రతంలో ముందు సాగే నిమిత్తం మంగళ దీపము కావాలి. లోకములన్నింటినీ. నీ చిరు బొజ్జలో దాచుకుని ఒక లేత మట్టి ఆకు మీద పరుండిన నీకు చేతకానిది ఏమున్నది స్వామి! కరుణించి మా వ్రతము సాంగోపాంగ ముగా పూర్తిగా ఎగునట్లు మంగళ శాసనము చేసి వీనిని ప్రసాదింపుము.
 *🪷***🪷***🪷

కామెంట్‌లు