" నీ కివే... మా జాహార్లు ..! "- కోరాడ నరసింహా రావు.
ఆద్యాత్మ దీప్తి....
 యువజన స్పూర్తి ..... 
 ప్రపంచ సభల లో... 
  ప్రజ్వలించిన.... 
    భారతీయ కీర్తి...! 

గురువునే పరీక్షించిన ఘనుడు
  ఆ గురువు కే ... అత్యంత
   ప్రియ తము డై నాడు...! 

నరేంద్ర నామ ధేయు డు
  వివేకానంద గా... 
   జగద్ విఖ్యాతుడు
 భారత మాత ముద్దు బిడ్డడు! 

సన్యాసి  అంటె.... 
  తానన్ని విడచి... 
   తన నందరూ విడిచిన... 
    సన్నా సి  కాద ని.... 
   ప్రజాక్షేమము నకై తపించిన
      ఋ షి యని.... 
   కాషా యానికి    కొత్త
   భాష్య0 చె ప్పిన.... 
   మహోన్నత వ్యక్తిత్వం...! 

 జాహార్     జోహార్...... 
  స్వామీ ... వివేకానందా..! 
   వివేకమే  ఆనందమని... 
  లోకానికి చాటి చె ప్పిన
  సార్ధక నామ ధేయా... 
  నీకివే... మా  జో హా ర్లు..!! 
     *******

కామెంట్‌లు