వోని విద్యార్ధిణి సాయివర్షకు 'తానా' ప్రశంసాపత్రం


 వోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ఎనిమిదో తరగతి విద్యార్థిణి సాహుకారు సాయివర్షకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం 'తానా' వారు ప్రశంసాపత్రం పంపారని పాఠశాల ప్రధానోపాధ్యాయని బలగ నాగమణి తెలిపారు. 
తానా రూపొందించిన అమ్మ, నాన్న, గురువు పద్యాలను సాయివర్ష నేర్చి, పఠించి గతనెల 19న పంపిన వీడియోను, స్వీకరించిన
ఉత్తర అమెరికా తెలుగు సంఘం 'తానా' అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు, వందేవిశ్వమాతరం ఛైర్మన్ జయశేఖర్ తాళ్ళూరి, తానా  ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురళ్ళ శ్రీనివాస్ లు అభినందిస్తూ ప్రశంసాపత్రాన్ని పంపారు. 
వంద దేశాల్లో ఉన్న వందకు పైగా తెలుగు సంఘాల సమన్వయంతో, 
వందేవిశ్వమాతరమ్ పేరిట,  
వంద దేశాల్లో నిర్వహించిన శాంతి సద్భావన యాత్రలో భాగంగా 'తానా' శతక పద్యార్చన కార్యక్రమాన్ని రూపొందించగా, తాము స్పందించి పాల్గొన్నామని పాఠశాల ప్రధానోపాధ్యాయని బలగ నాగమణి, ఉపాధ్యాయులు పాలవలస శారదాకుమారి, గోగుల సూర్యనారాయణ ,దానేటి పుష్పలత, సిద్ధాబత్తుల వెంకటరమణ కుదమ తిరుమలరావులు తెలిపారు.  ప్రపంచవ్యాప్తంగా పదిలక్షలమంది విద్యార్థులను పాల్గొనేలా రూపుదిద్దుకున్న నేపథ్యంలో, అందులో తమ పాఠశాల విద్యార్ధిణి కూడా పాల్గొని ప్రశంసాపత్రాన్ని సాధించుట ఆనందంగా ఉందని వారన్నారు.  అమ్మ శతకం ,నాన్న శతకం, గురువు శతకాలలోని పద్యాలను అభ్యసనం చేయుట ద్వారా విద్యార్థులలో తల్లిదండ్రుల పట్ల, గురువుల పట్ల మిక్కిలి పూజ్యభావం ఏర్పడుతుందని,  ప్రపంచంలోగల తెలుగు విద్యార్థులను, ఉపాధ్యాయులను
ఇంతటి పవిత్రమైన కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడం ద్వారా ఒక్క తాటి పైకి తెచ్చేలా ఈ శతక పద్యార్చన దోహదపడిందని అన్నారు. 
ఈ పద్యాలను నేర్చి, ప్రశంసాపత్రాన్ని పొందిన బాలిక సాహుకారు సాయివర్షను ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు, అనంతరం విద్యార్థులకు మిఠాయిలను పంచిపెట్టారు.
కామెంట్‌లు