లోక కళ్యాణం;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్
 గాలి
హేమంతానికి సీమంతం చేస్తోంది
మేఘం
వర్షించడం కోసం
గ్రీష్మంతో ఘర్షిస్తోంది
మన్మధుడు
గాలితెమ్మెరలమీద కదిలొస్తుంటే
కొమ్మలు కదిలి పూలుజల్లుతున్నాయి
వసంతం అంటేనే విరహం
మీన వాహనముమీద
మన్మధుడొచ్చి బాణాలేసి వెళ్ళగానే
అగ్నిదేవుడు
మేష వాహనముమీద తయారు
అందుకే
వసంతం తరువాత గ్రీష్మమే
ఇక గ్రీష్మం తరువాత వర్షం
వర్షం తరువాత హేమంతం
ఇలా
ప్రేయసీప్రియుల
సంయోగ వియోగాలు
లోక కళ్యాణార్థమే కదూ!!!
**************************************


కామెంట్‌లు
Joshi madhusudana sharma చెప్పారు…
మంచి కవిత. బాగుంది సార్. అభినందనలు. శుభాకాంక్షలు 🌹👏🌹
Joshi madhusudana sharma చెప్పారు…
మంచి కవిత. బాగుంది సార్. అభినందనలు. శుభాకాంక్షలు.