తిరుప్పావై –వరలక్ష్మి యనమండ్ర
30వ పాశురము
***********
వఙ్గ క్కడల్ కడైన్ద మాదవనై క్కేశవనై
త్తిఙ్గళ్ తిరుముగత్తు చ్చేయిళ యార్ శెన్ఱిరైఞ్జి
అఙ్గప్పరై కొణ్డవాతైయణిపుదువై
పైఙ్గమల త్తణ్ తెరియల్ పట్టర్ పిరాన్ కోదై శొన్న
శఙ్గత్తమిళ్ మాలై ముప్పదుమ్ తప్పామే
ఇఙ్గప్పరిశురై ప్పారిరణ్డు మాల్వరైత్తోళ్
శె ఙ్గణ్ తిరుముగత్తు చ్చెల్వత్తిరుమాలాల్
ఎఙ్గమ్ తిరువరుళ్ పెత్తిన్బురువ రెమ్బావాయ్
***********
భావము ....,..పంచపదులలో
***********

భక్తి తత్వమే ముక్తి మార్గము కన్నయ్యా
భవ స్మరణము నీ దివ్యనామము కన్నయ్య
నమ్మిన వారిని బ్రోచేస్వామీకన్నయ్యా
కూర్మ రూపమున కాపాడితివి కన్నయ్య 
ధన్వంతరిగా మోహిని రూపము కన్నయ్య 

విష్ణుచిత్తుని ముద్దుల కొమరిత కన్నయ్య
గోష్టితో కూడి సేవ చేసినదిగ కన్నయ్య 
ముప్పది రోజులు వ్రతము చేసినది కన్నయ్య
స్నాన వ్రతమును ఆచరించినది కన్నయ్య
సత్సంగముతో కీర్తన చేసెను కన్నయ్య

తామర పూసల మాలలు ధరించి ఓ చెలీ
గోపికలందరు గుంపుగ కూడి ఓచెలీ 
కృష్ణుని కీర్తనలు పాడిరిగా ఓ చెలీ
కృష్ణుని నిద్దుర లేపుచుండిరిగ ఓ చెలీ
కాత్యాయనీ వ్రతమును చేసిరి ఓ చెలీ

గోదాదేవి రంగని పతిగా ఓ చెలీ
ఎంచి పూజలు చేసినది ఓ చెలీ 
కృష్ణుని కొలిచి తరించినది ఓ చెలీ 
భోగి రోజున భోగముగా ఓ చెలీ
రంగనాధుని వివాహమాడెను ఓ చెలీ

స్థిర చిత్తముతో నమ్మిన వారికి ఓ చెలియా
లొంగునుగా భక్తవత్సలుడు  ఓ చేలియా 
లోకనాయకుడు కన్నయ్యే ఓ చెలియా 
లోకోద్ధారకుడు కన్నయ్యే ఓ చెలియా
ఆశ్రయిద్దాము ఆస్వామిని మనము ఓ చెలియా
***********


కామెంట్‌లు