వోని పాఠశాలలో ఘనంగా గణతంత్ర దినోత్సవం

 వోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయని బలగ నాగమణి అధ్యక్షతన గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ పతాకాన్ని ప్రధానోపాధ్యాయని బలగ నాగమణి ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ భారత రాజ్యాంగం 1949 నవంబర్ 26న ఆమోదం పొందిననూ, 1950 జనవరి 26న అమలులోకి వచ్చిందని అన్నారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన 
వైస్ ఎంపిపి కనపాక సూర్యప్రకాశరావు మాట్లాడుతూ మనమంతా స్వాతంత్ర్య సమర యోధుల, రాజ్యాంగ రూపకర్తల ఆశయసాధనలో పయనించి,దేశభక్తితో మెలగాలని అన్నారు. గౌరవ అతిథిగా విచ్చేసిన తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ వూయక చిన్నయ్య మాట్లాడుతూ విద్యార్థులంతా పాఠశాల స్థాయిలోనే చదువుతో పాటు క్రమశిక్షణ కూడా అలవర్చుకోవాలని 
రేపటి స్వర్ణయుగానికి వారసులుగా నిలవాలని అన్నారు. అనంతరం పలు పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు అతిథుల, ఉపాధ్యాయుల చేతులమీదుగా బహుమతులను అందజేశారు. వేషధారణ పోటీల్లో భారతమాతగా ఆకట్టుకున్న ఒకటవ తరగతి బాలిక నందిగాన గ్రీష్మ, పద్యపఠనపోటీలో సాహుకారు సాయివర్ష,  దేశభక్తిగీతాల పోటీలో దూసి శ్రావ్య, నృత్యరూపక ప్రదర్శనపోటీలో టొంపల అనూరాధ, ఆంగ్ల మాధ్యమ వక్తృత్వ పోటీల్లో డొంపాక కల్పన, గణతంత్ర దినోత్సవం ఆవశ్యకతపై వ్యాసరచన పోటీల్లో వూయక దినేష్, కనపాక సురేష్ లకు మెడిల్స్, షీల్డ్ లను బహూకరించారు. 
ప్రధానోపాధ్యాయని బలగ నాగమణి, ఉపాధ్యాయులు పాలవలస శారదాకుమారి, గోగుల సూర్యనారాయణ, దానేటి పుష్పలత, సిద్ధాబత్తుల వెంకటరమణ, కుదమ తిరుమలరావులు పాల్గొని ప్రసంగించారు. అనంతరం మిఠాయి పంపకం జరిగింది.
కామెంట్‌లు