సకారాత్మకంగా! అచ్యుతుని రాజ్యశ్రీ

 మనం ప్రతిదీ సంశయం తో  పని జరుగుతుందా లేదా అని ఆలోచిస్తూ కూర్చుంటే ఏపనీ చేయలేము.ఇంటా బడిలో ముందు పిల్లలకు పాజిటివ్ గా అంటే సకారాత్మకంగా ఆలోచించటం నేర్పాలి.అందుకే గురుకులాల్లో భక్తి శ్రద్ధలతో గురువు గురుపత్నిని సేవించి నమ్మకంతో ఎదిగారు.ఇప్పుడు చదువు ఉద్యోగం వస్తుంది రాదు అనే నకారాత్మకం తో సగం రోగాలు.వాషింగ్టన్ పోస్ట్ రిపోర్ట్ ప్రకారం పాజిటివ్ పేపర్ విశేషాలు ఆనందం మంచి ఊహల్లోకి తీసుకుని వెళ్తాయి.అలాంటి విషయాలు చర్చించాలి." ది హ్యాపియర్" అనే పుస్తకం రచయిత డాక్టర్ టాల్బెన్ ఇలా అన్నారు " మనముంగిట వాలే న్యూస్ పేపర్ మంచి చిత్రాలు వార్త ఉంటే ప్రపంచంలో మంచిఉంది అని సంతోషంతో పేజీలు తిప్పుతాం.మూడ్ బాగుంటుంది. మన శరీరంలో అలసట తగ్గి ఉల్లాసం ఉప్పొంగుతుంది.విసుగు చిరాకు హార్మోన్ల ఉత్పత్తి తగ్గిపోతుంది.క్వాలిటీ ఆఫ్ లైఫ్   అన్న పదం వాడారు రిసెర్చ్ రిసెర్చ్ చేసి.మనం గందరగోళం లో ఉన్నా  కొత్త ఆశలు కొత్త వెలుగు బాటలు చూపుతాయి.గుండె బలంగా గుండుగా హాయిగా నవ్వుతూ బి.పి.గుండెపోటు తగ్గిస్తుంది. నవ్వించే కథలు రాసి చదివి షేర్ చేసేవారు బోళాగాళ్ళు.మనసులో కపటం కుత్సితం లేకుండా హాయిగా మాట్లాడుతూ తాము నవ్వుతూ ఇతరులని నవ్విస్తారు. ఇక మనసులో ఏడుస్తూ పైకి ఇకిలించేవారు కపటంతో కుళ్లు గుమ్మడి కాయలను తలపిస్తారు.2014 లో ఎంగేజ్డ్ న్యూస్ ప్రాజెక్ట్ చేపట్టిన పరిశోధనలు తేల్చి చెప్పిన ఒకేఒక మాట" పేపర్ పబ్లిషర్స్ పెద్దలూ! పాజిటివ్ హాయిగా నవ్వులు పువ్వులు ఉండే పేజీలు ఎక్కువగా కేటాయిస్తే జనాలు ఆపేజీని భద్రంగా దాచుకుంటారు.చెడువార్త తాటికాయంత అక్షరాలతో ఉంటే మూడ్ ఖరాబ్! అందరిపై అంటే ఇంట్లో వారిపై చిటపట ఆవాలు లాగా చిందులేస్తూ ఎర్రమిరపకాయలా మిర్రి మిర్రి చూస్తూ ఏడ్పించే శాడిస్ట్ గా తయారు అవుతారు.ఇలాంటివాతావరణంలో పెరిగే పిల్లలు దొంగలు టెర్రరిస్టులు దేశ ద్రోహులు అవుతారు.ఇంట్లోంచి పారిపోతారు.అందుకే పేపర్ లో జోక్స్ కార్టూన్లు ఉంటే మనం దాచుకుని చదువుకుంటాం🌷
కామెంట్‌లు