శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది )ఎం. వి. ఉమాదేవి
161)నియమః -

అన్నిటిని నియమించువాడు
ప్రాణులనడుపుచుండువాడు
దిక్కులను పాలించువాడు
గ్రహాల, తారలకు నియామకుడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
162)యమః -

నిగ్రహించునట్టి శక్తియున్నవాడు
జీవులను అదుపులోనుంచువాడు
లయింపజేయగలిగిన వాడు
దుష్టనాశనము జేయువాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు!ఉమా!
163)వేద్యః -

సాధువులకు తెలియువాడు
వేదవేద్యుడైనట్టి వాడు
ముముక్షువులు సేవించువాడు
తాపసులకు చేరువనున్నవాడు
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
164)వైద్యః -

సర్వవిద్యలు తెలిసినవాడు
భవరోగముల ద్రోలేడివాడు
వైద్య శ్రేష్ఠుడై నిలిచినవాడు
వ్యాధులును తొలగించువాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
165)సదాయోగీః -

సదా యోగస్థితిలోనుండువాడు
స్వ స్వరూపమునున్నవాడు 
నిశ్చలభావనము గలవాడు
యోగస్థితిని ఇవ్వగలవాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )

కామెంట్‌లు