సౌందర్యలహరి - కొప్పరపు తాయారు
  🌻 శ్రీ శంకరాచార్య విరచిత🌻

 మనస్తం వ్యోమ త్వం మరుదసి మరుత్సారథిరసి
త్వమాపస్త్వం భూమిస్త్వయి పరిణతాయాం న హి పరమ్ ।
త్వమేవ స్వాత్మానం పరిణమయితుం విశ్వవపుషా
చిదానందాకారం శివయువతి భావేన బిభృషే ॥ 35

తవాజ్ఞాచక్రస్థం తపనశశికోటిద్యుతిధరం
పరం శంభుం వందే పరిమిలితపార్శ్వం పరచితా ।
యమారాధ్యన్ భక్త్యా రవిశశిశుచీనామవిషయే
నిరాలోకేఽలోకే నివసతి హి భాలోకభువనే ॥ 36 ॥

35) ఓ అర్ధనారీశ్వరీ! నీవే మనసువి, నీవే ఆకాశానివి , నీవే వాయువి, నీవే అగ్నివి, నీవే జలానివి, నీవే భూమివి. ఈ విశ్వరూపం నీ విశ్వ పరిణామమే. నీకంటే అన్య పదార్థం ఏమీ లేదు. విశ్వ శరీరంగా పరిణమించడానికే నీ చిదానందాకారాన్ని శివ శక్తి అని దంపతీ రూపంగా ధరిస్తున్నావు కదా తల్లీ !
36) అమ్మా! నీ ఆజ్ఞా చక్రంలో విరాజిల్లుతూ, కోటి సూర్యచంద్రుల తేజస్సుతో భాసిల్లుతున్న ఆ పరమశివమూర్తిని ధ్యానిస్తున్న.అతని  వామభాగం పరజితి అనే నీతో మిళితమై ఉన్నది. అటువంటి మిమ్మల్ని ఆరాధించేవారు సూర్యచంద్రాగ్నుల ప్రకాశానికి  అతీతమైన లోకంలో వర్తిస్తారు. ఆ పరమశివదేవుడు సూర్యచంద్రాగ్నుల ప్రకాశాలను అధిగమించిన మహత్తర తేజంతో బాసిల్లుతూ ఉంటాడు. అక్కడ విఘ్న బాధలు ఏవీ ఉండవు కదా తల్లీ !
                 ****🪷*****
తాయారు 🪷

కామెంట్‌లు