చదువుల తల్లి!!!- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పిఎస్ నంది వడ్డేమాన్ నాగర్ కర్నూల్ జిల్లా.
ఉపాధ్యాయినిలు
ఉద్యోగులు కాదు-సేవకులు!!!

ఉపాధ్యాయినిలు
విద్య బోధకులు కాదు-

ఉపాధ్యాయినీలు
విద్యా దాతలు కాదు-

ఉపాధ్యాయునిలు
దూతలు-విద్యా దూతలు!!!

ఉపాధ్యాయునిలు
విద్యావేత్తలు కాదు
ఉపాధ్యాయుని లు
అభ్యుదయ ఆధ్యాత్మికవేత్తలు!!!

ఉపాధ్యాయునిలు
సామాజిక నిపుణులు కాదు
ఉపాధ్యాయునిలు
మానసిక నిపుణులు!!!

శరీరానికి ఆహారం కావాలి
మెదడుకు ఉపాధ్యాయుడు కావాలి!!
మనసు ఉపాధ్యాయుని
దర్శించుకోవాలి!!!!

ఉపాధ్యాయిని
సందేశం కాదు
ఉపాధ్యాయిని 
దర్శకురాలు - మార్గదర్శకురాలు!!

ఉపాధ్యాయిని - నేర్పదు!!
ఉపాధ్యాయిని
నేర్చుకునేందుకు నేర్పును కలిగిస్తుంది!!!

ఉపాధ్యాయిని శ్రామికరాలు కాదు
ఉపాధ్యాయిని ఒక కర్మాగారం!!

చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని.

సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం.

కామెంట్‌లు