దత్తపది; - సాహితీసింధు, పద్యగుణవతి సరళగున్నాల

 కరము సరము నరము వరము
పదాలతో చంపకమాలలో దత్తపది
==========================
చం*కరమున పూలుగూర్చియవి కాంతులు జిమ్మగ నొక్కచోటునన్
సరముగ మార్చి దేవుడికి సంస్కృతు లొప్పగ పూజజేసినన్
నరములు లేని నాల్కలును నాకము వీడగ నిందవేయగా
వరముల నీయ రావలయు పార్వతివల్లభుడాశివుండిటన్
కామెంట్‌లు